కుటుంబ కలహాల నేపథ్యంలో పోచారం ఆటో డ్రైవర్ అదృశ్యం”
ఘట్కేసర్ జూన్ 6 : ఘట్కేసర్ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారం గ్రామానికి చెందిన వరికుప్పల రమేష్ (45) ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి కుటుంబ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి భార్య మహేశ్వరి, రమేష్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన రమేష్...