కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలను తీసుకుని మహిళ అదృశ్యం
ఘట్‌కేసర్, జూలై 21: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. అన్నోజిగూడ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీకి చెందిన ఓర్సు లింగం అనే కూలీ కార్మికుడు మంగళవారం పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య సరిత (31)తో 2009లో వివాహం జరిగిందని, వారికి ఇద్దరు...