కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్07)దువ్వూరు, కుక్కల దాడిలో చిరుత పిల్ల మృతి,చిరుత పిల్లను కుక్కలు చంపిన ఘటన మంగళవారం దువ్వూరులో చోటుచేసుకుంది. దువ్వూరు మండలం చిన్నబాకరపురం గ్రామ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన జరిగింది.ఎక్కడి నుంచి దారితప్పి వచ్చిందో మరి ఒక చిరుత పిల్ల గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చింది.ఈ క్రమంలో పొలాల్లో సంచరిస్తున్న చిరుత కుక్కల గుంపు కంట పడింది.దీంతో కుక్కలు ఒక్కసారిగా చిరుతపై దాడి చేశాయి.తీవ్రంగా గాయపడిన చిరుత కూన కొద్ది సేపటి తర్వాత మృతి చెందింది.కుక్కలుగుంపుగా దాడి చేయడంతో అది తీవ్రంగా గాయపడి మృతి చెందింది.స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.