కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) బద్వేల్ పట్టణం సిద్ధవటం రోడ్డు,వైయస్సార్ సర్కిల్ సమీపంలో ప్రముఖ కరెంటు కాంట్రాక్టర్ పెద్దిరెడ్డి నర్సారెడ్డి,ఇంటి ముందు చలివేంద్రాన్ని గురువారం ప్రారంభించారు.నర్సారెడ్డి,సతీమణి కీర్తిశేషులు పెద్దిరెడ్డి లక్ష్మమ్మ, జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా ఈ చలివేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన కుమారులు డాక్టర్ జయసింహారెడ్డి,డాక్టర్ విజయ నరసింహారెడ్డి,అల్లుడు సింగమల సుధాకర్ రెడ్డి తెలిపారు. మండుటెండల్లో పాదచారులు,చిరు వ్యాపారస్తులు,ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఈ సేవా కార్యక్రమం చేపట్టామన్నారు.ఈ కార్యక్రమంలో రామాలయం కమిటీ చైర్మన్ గోనుగుంట వెంకటసుబ్బారెడ్డి,బద్దెన కళా పీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి,ఆదూరి వీర ప్రతాపరెడ్డి,జమ్మన వేణుగోపాల్ రెడ్డి,కత్తెరపల్లె రాజశేఖర్ రెడ్డి,పాపదిప్పు మల్లికార్జున రెడ్డి,మాచుపల్లి రాజారెడ్డి, కనుపర్తి చెన్న కృష్ణారెడ్డి, లేపాకు రామకృష్ణారెడ్డి,ఎస్.ఎన్.సుబ్బరాయుడు, కల్లూరు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొని మజ్జిగ, చల్లని మంచినీటిని వితరణ చేశారు.