prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:39 pm Digital Edition : PRAJA VANI

కిషోరి బాలికలకు ఉచిత వైద్య శిబిరము

కిషోరి బాలికలకు ఉచిత వైద్య శిబిరము.

రీడ్స్ సంస్థ డైరెక్టర్ థియో స్టీఫెన్. 

ఐరాల మే 4 ప్రజావాణి : ఐరాల మండలంలోని రీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో స్టీఫెన్ పబ్లిక్ స్కూల్ ఐరాల నందు కిషోరి బాలికలకు, ఉచిత వైద్య శిబిరము నిర్వహించబడునని రీడ్స్ సంస్థ డైరెక్టర్ థియో స్టీఫెన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ సి.ఎం.సి చిత్తూరు వారి సహకారంతో, ఐరాల లోని స్టీఫెన్ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ నందు శుక్రవారం ఉదయం  9 గంటల నుండి 1గంట వరకు సిఎంసి ప్రముఖ వైద్య నిపుణులచే కిషోరి బాలికలకు వయసు 10 నుండి 18 సంవత్సరాలలోపు ఉన్న బాలికలకు, ఉచిత వైద్య శిబిరము నిర్వహించబడునని తెలిపారు. అనంతరం కిషోరి బాలికలలో పెరుగుదల, వయసులలో వచ్చే శారీరక మానసిక మార్పుల పైన అవగాహన కల్పించడం, అలాగే రక్తహీనత నివారణ, పౌష్టికాహారం, బాలికల ఎత్తు బరువు, జనరల్ హెల్త్ చెకప్ తో పాటు పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం తీసుకోవడంపై కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కలుగజేయడం, వైద్య పరీక్షల అనంతరం అవసరమైన కిషోరి బాలికలకు ఉచితంగా మందులు అందజేసి, వైద్యం అవసరమైన వారికి సిఎంసి హాస్పిటల్ చిత్తూరు కి రెఫర్ చేయబడునని ఈ అవకాశాన్ని మండలంలోని కిషోరి బాలికలు ఉపయోగించుకోవాలని, ఈ సందర్భంగా ఆయన తెలిపారు.