prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 3:47 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కాశీనాయనలోని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి సి.పి.ఎం డిమాండ్

కాశీనాయనలోని ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి.
ధనిక పెత్తందారి ల్యాండ్ మాఫియా ముఠాలను అదుపు చేయాలి. పేదల హక్కులను పాలక ప్రభుత్వాలే కాలరాస్తున్నారు.మూలపల్లి, నాయనపల్లి, అక్యీంగుండ్ల గ్రామాల్లోని ప్రభుత్వ భూముల బినామీల పట్టాలు రద్దు చేయాలి.సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్.
2026 ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు, కాశి నాయన మండలం, నరసాపురం ఎమ్మార్వో కార్యాలయం ప్రాంగణంలో, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (ఎ.ఐ.ఎ.డబ్ల్యూ.యు.), కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్.) మండల కమిటీల ఆధ్వర్యంలో “భూ సరస్సు” వ్యవసాయ కార్మిక సంఘం కాశీనాయన మండలం కార్యదర్శి పోలయ్య అధ్యక్షతన జరిగింది.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్), సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ భూమిలేని పేదలను ఉద్దేశించి మాట్లాడుతూ… వరికుంట్ల గ్రామ పొలం సర్వేనెంబర్ 217లో 800 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, సాగులో ఉన్న వారికి భూ హక్కులు కల్పించాలని కోరారు. ఆకుల నారాయణపల్లె గ్రామం అలంపూర్ సర్వేనెంబర్ 2227 లో కండ పోరంబోకు ఉందని భూమిలేని అన్ని కులాల వారు తరతరాలు అనుభవించుకుంటున్నారని వారికి సర్వే చేసి బిజెపి పట్టాల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అక్యీంగుండ్ల రామ పొలం సర్వేనెంబర్ 3 నుంచి 9 వరకు 20 మంది సాగులో ఉన్న రైతులకు హక్కులు కల్పించాలన్నారు. కే.ఎన్.కొట్టాలు, సావిశెట్టి పల్లె, ఇటుకలపాడు, మిద్దెల గ్రామాల పరిధిలో 34 సర్వేనెంబర్ నుండి 158 సర్వేనెంబర్ వరకు సాగులో ఉన్న భూమిలేని పేదలందరికీ ఊ హక్కులు కల్పించాలని లేకుంటే ఈ ప్రభుత్వ భూములను గ్రామీణ ధనిక పెత్తందారి వర్గాల ల్యాండ్ మాఫియా ముఖాలను ప్రభుత్వ అధికారులు అదుపు చేయాలని వారు కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష మాట్లాడుతూ… ఉపాధి హామీని నీరు గార్చి, నిధులు కుదించి కేంద్రంలోని బిజెపి, ఎన్.డి.ఏ. ప్రభుత్వాలు గ్రామీణ పేదలపై, రైతుల ఉపాధిపై దాడి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని టిడిపి, జనసేన ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న ప్రశ్నించడం మానేశాయని, ప్రజలపై దాడి చేస్తున్న నిమ్మకు నీరు ఎత్తినట్టుగా నిమ్మకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శివకుమార్, కుల వివక్షత వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి.వెంకటేష్, కాశి నాయన మండలంలోని 10 గ్రామాలైన వరికుంట్ల, ఆకుల నారాయణపల్లె, అక్కింగుండ్ల, కే.ఎన్.కొట్టాల, సావిశెట్టిపల్లె, ఇటుకలపాడు, మిద్దెల, మూలపల్లి తదితర 10 గ్రామాల నుండి వ్యవసాయ కార్మిక సంఘం, కె.వి.పి.ఎస్. నాయకులు వరికుంట్ల బాబు, రాముడు, సావిశెట్టిపల్లె రాజశేఖర్, నాయన పల్లె లక్ష్మయ్య, తులసిరామయ్య, ఇటుకలపాడు ప్రభాకర్, వెంకటసుబ్బయ్య, మిద్దెల ఓబయ్య, జయరాజు మరియు భూమిలేని పేదలు 100 మంది కి పైగా పాల్గొన్నారు