ప్రజావాణిన్యూస్(మార్చి23)మార్కాపురం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లె నివాసి రావిపాటి పెద్ద పుల్లారెడ్డి కుమారుడు రావిపాటి నాగార్జున రెడ్డి వారి ధర్మపత్ని హైమావతి గార్ల కూతురు నీల ప్రణతి పుట్టినరోజు సందర్భంగా గిద్దలూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు పేదలకు నిరుపేదలకు ఆసరాలేని అవ్వ తాతలకు కాశినాయన భక్తులకు ప్రతి సోమవారం భోజనం ఏర్పాటు చేశారు అనంతరం వారి సహోదరి వారి బావ లక్ష్మీరెడ్డి కాశి నాయన విగ్రహానికి అభిషేకం చేసి నూతన వస్త్రాలు పూలమాలతో అలంకరించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం వారు దగ్గర ఉండి పాల్గొన్న భక్తులకు భోజనం వడ్డించారు వారికి శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన అన్న వితరణ సేవాశ్రమం తరపున కాశినాయన పటము పూలమాలలు శాలువాతో ఘనంగా సత్కరించామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారు తెలిపారు. ప్రతి సోమవారం భోజనం ఏర్పాటు చేయుట కొరకు దాతలు సహకరించాలని హృదయపూర్వకంగా కోరారు కాశినాయన గిద్దలూరు ప్రాంతంలో ఎక్కువగా నడియాడుతున్న సమయంలో ప్రతి పాడుబడినటువంటి గుడి బాగు చేయించి అక్కడ అన్నవితరణ చేపించేవారని తెలిపారు అదే క్రమంలో గిద్దలూరు లోని కాశినాయన గుడి ఆవరణమునందు భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిత్యం దాతలదే పుణ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖ సూపర్నెంట్ పాలుగుల్ల కాశిరెడ్డి విశ్రాంత లెక్చరర్ వడ్డీ వీరారెడ్డి విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి వెంకటేశ్వర్ల గౌడ్, కాశినాయన ప్రధమ శిష్యురాలు ముక్కంటి నరసమ్మ టీ కొట్టు నారాయణమ్మ విశ్రాంత జిల్లా సర్వేయర్ రెడ్డి మల్లారెడ్డి భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు ఓబీసీ ఉపాధ్యక్షులు ముల్లపాడు బాదుల్లా శివపురం హరికృష్ణ యువ ప్రగతి అధ్యక్షులు ఫరూక్ కాశినాయన భక్తులు తదితరులు పాల్గొన్నారు.