కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటమే ఏకైక మార్గం – మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్రన్

ఘట్‌కేసర్, జూన్ 13: కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఐక్య పోరాటమే ఏకైక మార్గమని తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. రవిచంద్రన్ అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ కార్మికుల సదస్సు శనివారం ఘట్‌కేసర్ మహిళా భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవిచంద్రన్ మాట్లాడుతూ, మున్సిపాలిటీల నుంచి జీహెచ్‌ఎంసీలో విలీనం అయిన కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన...