తెలంగాణ రా

ష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీలలో పనిచేస్తున్న నైపుణ్య,అర్థ నైపుణ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు తగ్గించడం సరికాదని *ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా {టి యు సి ఐ} మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి* అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో *నేడు మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్* కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జీవో నెంబర్ 6 ప్రకారం మూడు కేటగిరీలుగా ఉన్న మున్సిపల్ కార్మికులను రెండు కేటగిరీలుగా కుదించి ఇస్తున్న జీతాలను తగ్గించటం అన్యాయమన్నారు.ప్రజా ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో నెంబర్ 6 పేరుతో డ్రైవర్స్ కు 20,500 నుండి 16,600 కు తగ్గించబడింది. డేటా ఆపరేటర్స్ కు 23,750 నుండి 19500 వరకు వర్క్ ఇన్స్పెక్టర్ కు 20,500 నుండి 16,600 వరకు బోర్ రిపేర్ మాన్ 20,500 నుండి 15600 కు తగ్గించడం జరిగింది. జీవో నెంబర్ 43 పేజీల లో 364 మున్సిపాలిటీలలో వివిధ కేటగిరీలలో వివరంగా ఇవ్వడం జరిగింది సరికాదన్నారు … కనీస వేతన0 31 వేలు అమలు చేయాలని ఆందోళన చేస్తుంటే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉన్నదన్నారు. ఐడి ఆక్ట్ ప్రకారం ఇస్తున్న జీతాలు కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గించరాదని అలా జరిగితే పది రెట్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని చట్టంలో ఉందని రవి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ విధానం కార్మిక లోకాన్ని మోసం చేసేదిగా ఉందని దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే దశల వారిగా ఐక్య ఆందోళన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపు మెడల వంచక తప్పదని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో *యూనియన్ అధ్యక్షుడు మంగళపల్లి గురుకుయాకయ్య, మురళి సోమన్న కుమార్ వెంకటయ్య వెంకన్న టాగూర్ మహేష్ వెంకన్న లక్ష్మీ యాకమ్మ* తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.