కార్మికులను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి: భవన నిర్మాణ కార్మికుల డిమాండ్
ఘట్కేసర్, జూన్ 8 (ప్రజావాణి): తమను అవమానకరంగా దూషించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని పోచారం పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నిర్మాణ రంగంలో శ్రమిస్తున్న కార్మికులను కొందరు సెంట్రింగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు “దళారీలు, మోసగాళ్లు” అంటూ చేసిన వ్యాఖ్యలపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తాన్ని...