కార్మికులకు వైద్య, సామాజిక భద్రత కల్పించాలి: గాంధారి అశోక్ అంబేద్కర్ కృషితోనే కార్మిక హక్కులు సాధ్యం: వినోద్ రెడ్డి

ఘట్కేసర్, మే 1 (ప్రజావాణి): అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా మేడ్చల్ జిల్లా పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్పలోని వాటర్ ప్లాంట్ ప్రాంగణం, అన్నోజిగూడ ఎస్టీ కమ్యూనిటీ హాల్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పోచారం డివిజన్ అధ్యక్షులు గాంధారి అశోక్ ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఎగరవేసి, కార్మికులు పరస్పరం స్వీట్లు పంచుకుంటూ మే డే సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గాంధారి అశోక్ మాట్లాడుతూ కార్మికులకు వైద్య పరమైన మరియు సామాజిక భద్రత కల్పించాల్సిన...