prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 6:46 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కార్పోరేట్, ప్రైవేట్ కళాశాలలకు కొమ్ముకాస్తున్న ఆర్.ఐ.ఓ పై చర్యలు తీసుకోవాలి: – ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు

కడప (మే30 ప్రజావాణి) వ్యాప్తంగా నిబంధలు పాటించని,గుర్తింపు లేని కళాశాలలపై చర్యలు తీసుకోకుండా వాటికి కొమ్ముకస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆర్.ఐ.ఓ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు.శనివారం ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో కడప ఇంటర్మీడియట్ ఆర్.జె.డి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా ముందస్తు అక్రమ అడ్మిషన్స్ నిర్వహిస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్న ఆర్.ఐ.ఓ పై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.విద్యాసంవత్సరం ప్రారంభం కాక మునుపే జూనియర్ కళాశాలలు తరగతులు నిర్వహిస్తూ బహిరంగంగానే కళాశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ఎలాంటి చర్యలు లేవన్నారు.కో-ఎడ్యుకేషన్ పర్మిషన్ తీసుకొని బాయ్స్,గర్ల్ క్యాంపస్ లు నిర్వహిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కు అయ్యారని వారు తెలిపారు.విద్యార్థి సంఘాలు పిర్యాదు చేస్తే దానిని అవకాశంగా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నడపడంలో కూడా ఆర్.ఐ.ఓ పూర్తిగా విఫలమయ్యారని మాస్ కాపీయింగ్ ను ప్రోత్సహిస్తున్నారని వారు అన్నారు.నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్,కార్పోరేట్ కళాశాలలకు కొమ్ముకాస్తు అక్రమాలకు పాల్పడుతున్న ఆర్.ఐ.ఓ పై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు చిరంజీవి,ఏ.ఐ.ఎస్.బి నాయకులు అఖిల్, అంజి, చైతు,నాని,ప్రణయ్, చింటూ లు పాల్గొన్నారు.