prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 9:16 pm Digital Edition : PRAJA VANI

కార్పొరేట్ విద్యా దేవుడు ఎరుగు ప్రభుత్వ స్కాలర్షిప్ మంజూరైన దర్జాగా ఫీజు వసూలు

*కార్పొరేట్ “విద్యా” దేవుడు ఎరుగు..!

*ప్రభుత్వ స్కాలర్షిప్ మంజూరైన దర్జాగా ఫీజు వసూల్…?

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కాలేజీ నిర్వాహకుల నిర్లక్ష్యం..?

అకౌంటు విద్యార్థినీదే… మరి ఐఎఫ్సి కోడ్ మాత్రం మహబూబ్ నగర్…?

రెండేళ్లుగా మంజూరైన స్కాలర్షిప్ లో యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం…?

*ముఖం చాటేస్తున్న యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల అసహనం

*ఇట్లైతే… ఎట్లా అధ్యక్షా…?

మన ప్రజావాణి ప్రత్యేక కథనం…1

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ప్రభుత్వం విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి మెరుగైన విద్యా కుసుమాలు వికసించాలని ప్రభుత్వం సంకల్పించి కోట్లాది రూపాయల బడ్జెట్ కేటాయించి యంగ్ ఇండియా స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలలో అనేక సంస్కరణలు మార్పులు చేసి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ప్రైవేటు యాజమాన్యాలకు నిర్దిష్టంగా నిబంధనలు విధించి ముందుకు సాగుతున్న నేపథ్యంలో వ్యాపారమే పరమావధిగా భావించిన కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి బి సి ఎస్ సి ఎస్టీ వర్గాల విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతి ఏడాది ఆర్థిక సాయం అందిస్తున్న నేపథ్యం. కానీ ప్రభుత్వనిబంధనలను ఉల్లంఘించి కార్పోరేట్ విద్య అంటూ ఇంటర్మీడియట్ అడ్మిషన్ల.సమయంలో ఊదర కొట్టి విద్యార్థినీ విద్యార్థులను చేరే విధంగా తల్లిదండ్రులను ప్రసన్నం చేసుకోని అడ్మిషన్లు పొందిన తర్వాత పలురూపాలలో ఫీజులు వసూలు చేసి దండుకుంటున్న విమర్శలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది వినిపిస్తున్న నేపథ్యం. ఇటీవల ప్రభుత్వం ప్రవేట్ విద్యాసంస్థలు నిర్దిష్టమైన నిబంధనలు పాటించాలని పదేపదే ఆదేశాలు ఇస్తున్నప్పటికీ కొన్ని యాజమాన్యాలు దొడ్డదారిన అక్రమాలకు పాల్పడుతున్నట్లు పలువురు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మన ప్రజావాణి ఖమ్మం బ్యూరో ప్రతినిధి వీరభద్రం సేకరించిన సమాచారం మేరకు ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక బస్ డిపో రోడ్లో ఉన్న ఓ ఇంటర్మీడియట్ కాలేజ్ యాజమాన్యం సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా ఓ విద్యార్థినికి 2023 24 విద్యాసంవత్సరానికి బీసీ స్కాలర్షిప్ మంజూరై ఆ తర్వాత 2024 2025 లో కూడా మంజూరైనప్పటికీ నేటి వరకు విద్యార్థిని అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడంతో ఇటీవల ఆ విద్యార్థిని తల్లిదండ్రులు ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా సదరు కళాశాల ప్రిన్సిపాల్ మమ్మల్ని అడగలేదు అప్పుడు ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదు అని అన్నట్లు సమాచారం. అకౌంట్  లో డబ్బులు పడలేదని ఆ విద్యార్థిని తల్లిదండ్రుల నుండి బీసీ స్కాలర్షిప్ పేరుతో రెండు సంవత్సరాల పెండింగ్ డబ్బులు పదివేల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది. నేపాన్ని ప్రభుత్వంపై నెట్టి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి నిండుగా ఫీజులు వసూలు చేయడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులు తల్లిదండ్రులు అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థికి నిధులు జమ అయిన విషయం కాని విషయం యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యా కుసుమాలు వికసించడం దేవుడు ఎరుగు ప్రతి ఏడాది ఎన్ని అడ్మిషన్లు వచ్చాయనే లెక్కల్లో ఆ యాజమాన్యం వ్యవహరించడం విశేషమని పలువురు జిల్లా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా విద్యార్థిని స్కాలర్షిప్లు అప్లికేషన్ లో టెక్నికల్ సమస్యలు తప్పులు దొర్లినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి స్పందించి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా ఖమ్మం టౌన్ లో ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులకు చెందిన ఉపకార వేతనాలు పూర్తిస్థాయిలో ఖాతాలలో చేరాయో లేవోనని సమగ్ర విచారణ చేసి విద్యార్థిని విద్యార్థులకు న్యాయం చేయాలని పలువురు జిల్లా ప్రజలు విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు..

*మరికొన్ని సమగ్ర వివరాలుతో అధికారుల వివరణతో.. రేపటి కథనం..2లో వేచి చూడండి…!