
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ కార్పొరేట్ మరియు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులపై భారీ ఫీజుల భారం మోపుతూ దోపిడీకి పాల్పడుతున్నాయని, ప్రభుత్వం వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత విద్యార్థి బ్లాక్ AISB కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి AISB రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి పల్లి పృథ్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి, పేద కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్మిషన్ ఫీజులు, బిల్డింగ్ ఫండ్, బస్ ఫీజులు, హాస్టల్ ఛార్జీలు పేర్లతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఫీజు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన, అందుబాటు విద్య అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.AISB రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తుందని, ఫీజుల దోపిడీ ఆగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో AISB నాయకులు గౌతమ్ ,మనోహర్, సుకృత్, మనోజ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.