prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 8:54 am Digital Edition : PRAJA VANI

కారు ఢీకొని వ్యక్తి మృతి

చెన్నారావుపేట జూన్ 21 ప్రజావాణి

మండల పరిధిలోని ముగ్దుంపురం శివారు దిల్ డాబా వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఖాదర్‌పేట గ్రామానికి చెందిన కడుదూరి ఇంద్రసేన(51) ద్విచక్ర వాహనంపై రుద్రగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. అక్కల్‌చెడ గ్రామానికి చెందిన కరెడ్ల గణేష్ తన ఎర్టిగా కారుతో నర్సంపేట నుండి చెన్నారావుపేట వైపు వస్తూ అతివేగంగా బైక్‌ను ఢీకొట్టాడు. కారు బలంగా తగలడంతో తీవ్ర గాయాలైన ఇంద్రసేన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునీ ప్రమాద వివరాలను సేకరించారు. డ్రైవర్ గణేష్ పరారీలో ఉండగా ప్రమాదానికి కారణమైన ఎర్టిగా వెహికల్ నీ అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పంచనమ నిమిత్తం నర్సంపేట ఏరియా ఆసుపత్రి మార్చురీ గదికి తరలించారు.