కారును వెంబడించి బెదిరించిన ఇద్దరు యువకుల అరెస్ట్
ఘట్‌కేసర్, జూలై 1: కారులో కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న వ్యక్తిని వెంబడించి భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరు యువకులను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఘటనకు ఉపయోగించిన పల్సర్ ఎన్‌ఎస్ 160 మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సైదాబాద్‌కు చెందిన పోడు సాయి కుమార్ ఈ నెల 21న వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తన కుటుంబ సభ్యులతో కలిసి హోండా అమేజ్ కారులో వస్తుండగా, ఔషపూర్ సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై...