కామారెడ్డిలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయండి.
తిరుమలాయపాలెం,ప్రజావాణి: మార్చి 24, 25 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించనున్న అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐపీకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేపాకుల శివలింగం పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా తెట్టల్‌పాడు గ్రామంలో గోడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా రేపాకుల శివలింగం మాట్లాడుతూ.. దేశంలో ఒకవైపు మత చాందసవాద ఉన్మాదం, మరోవైపు సరళికృత పెట్టుబడిదారీ విధానాలు ప్రజలపై, ముఖ్యంగా వ్యవసాయ కూలీలపై తీవ్రమైన దాడులు కొనసాగిస్తున్నాయని అన్నారు. దేశంలో రోజుకు వేలాది చిన్న,...