కాచవాని సింగారంలో ల్యాండ్ పూలింగ్‌కు ప్రజల స్వచ్ఛంద మద్దతు
ఘట్‌కేసర్, జూన్ 30: ఘట్‌కేసర్ మండలంలోని కాచవాని సింగారం గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మంగళవారం ఘట్‌కేసర్ మండల ఎమ్మార్వో చంద్రశేఖర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది భూ యజమానులు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా గ్రామాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భూ యజమానులు ప్రభుత్వ...