కాకినాడ పోర్టు వద్ద పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతి బహిర్గతం 910 టన్నుల బాయిల్డ్ రైస్ సీజ్,,

కాకినాడ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్15) కాకినాడ యాంకరేజ్ పోర్టు పరిసరాల్లో పీడీఎస్ బియ్యం అక్రమ ఎగుమతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది.రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ఆధ్వర్యంలో పౌర సరఫరా,రెవెన్యూ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో అవకతవకలు బయటపడ్డాయి.పోర్టు సమీపంలో భార్జీలు,రైల్వే వ్యాగన్‌లలో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించిన అధికారులు,చెక్‌పోస్ట్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు.బాయిల్డ్ రైస్,రా రైస్,రా బ్రోకెన్స్ ఎగుమతి విధానంపై వివరాలు సేకరించారు.టెక్నికల్ సిబ్బంది నమోదు చేసిన రికార్డులను సమీక్షించి సూచనలు ఇచ్చారు.తదుపరి మానస ఎంటర్‌ప్రైజెస్...