కాకరవాయి సైడ్ కాలువలపై సెలెక్టివ్ చర్యలేనా..!

తిరుమలాయపాలెం, ప్రజావాణి: తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలోని ఐలమ్మ సెంటర్‌లో సైడ్ కాలువల ఆక్రమణల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి మాత్రం కొందరినే లక్ష్యంగా చేసుకుని “సెలెక్టివ్ చర్యలు” కొనసాగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రాంతంలో పూర్తిగా కాలువలను ఆక్రమించి పెద్ద స్థాయిలో నిర్మాణాలు చేపట్టిన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో చిన్నపాటి నిర్మాణాలు చేసిన వారిపై మాత్రం తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. “పెద్దవారికి మినహాయింపులు… చిన్నవారికే...