కాకరవాయి వేణుగోపాల స్వామి గుడి మాన్యం ఏమైనట్టు..?

తిరుమలాయపాలెం,ప్రజావాణి: కాకరవాయి గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి సంబంధించిన మాన్యం భూముల వ్యవహారం పై రోజురోజుకూ అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పెద్దలనుంచి వెలువడిన వివరాల  ప్రకారం గుడి పేరిట సుమారు 12 ఎకరాల మాన్యం భూమి ఉన్నప్పటికీ, అధికారిక రికార్డుల్లో ఆ వివరాలు కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.ఈ నేపథ్యంలో దేవాలయ ప్రధాన అర్చకుడి పాత్రపై గ్రామ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గుడి మాన్యం భూముల వివరాలు బయటపడకపోవడం వెనుక సూత్రధారుడు అర్చకుడేనని కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మాన్యం భూముల చిట్టా...