కాకరవాయి-జూపెడ రహదారిపై వందల కోళ్ల డంపింగ్.. ప్రజల్లో ఆందోళన.

తిరుమలాయపాలెం ప్రజావాణి: కాకరవాయి, జూపెడ మధ్య ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు బొలెరో వాహనంలో తీసుకువచ్చి వందల సంఖ్యలో చనిపోయిన కోళ్లను పడేసి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నెంబర్ ప్లేట్ లేని వాహనంతో వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటన వెనుక కూడలి గ్రామానికి చెందిన ఓ కోళ్ల ఫారం వ్యాపారి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి పక్కన పడేసిన కోళ్ల వల్ల తీవ్ర దుర్వాసన వ్యాపిస్తూ, ఈగలు, కుక్కల సంచారం పెరిగి ప్రజలకు ఇబ్బందులు...