prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 March 2026, 4:51 am Digital Edition : VENU THIRUMALAYAPALEM

కాకరవాయిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.

కాకరవాయిలో టీడీపీ జెండా ఆవిష్కరణ చేసిన గ్రామ శాఖ అధ్యక్షుడు కొలిశెట్టి బిక్షమయ్య..

తిరుమలాయపాలెం, ప్రజావాణి:

తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొత్త బజార్ సెంటర్‌లో గ్రామ శాఖ అధ్యక్షుడు కొలిశెట్టి బిక్షమయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమం మొత్తం పార్టీ కార్యకర్తల నినాదాలతో మారుమోగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి ఇప్పటివరకు ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ వచ్చిన పార్టీగా నిలిచిందని తెలిపారు. గ్రామీణ అభివృద్ధి, పేదల సంక్షేమం, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించిందన్నారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అలాగే రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలంగా నిలబెట్టాలని నాయకులు సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు పార్టీ నినాదాలు చేస్తూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.ఈ వేడుకలు ఉత్సాహంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించబడగా, పార్టీ కార్యకర్తల సహకారంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో కాకరవాయి గ్రామా టిడిపి ఉపాధ్యక్షుడు దేశోజు తార్నాచారి, గ్రామ కార్యదర్శి దాసరి జనార్ధన్, సీనియర్ నాయకులు దాసరి పాపయ్య,పూర్ణ చారి,దాసరి రవి, వార్డు సభ్యులు కుంభం సాలయ్య, గుండా ఆంజనేయులు, కార్యకర్తలు కొలిశెట్టి సోమయ్య,మోత్కూరు వెంకటేశ్వర్లు,పెనుగొండ వెంకన్న,తాటికొండ వీరన్న, నరసింహరావ్ తదితరులు పాల్గొన్నారు.