prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 10:18 am Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపెట్టాలి

కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని చూపెట్టాలి

*హరీష్ రావు, బాల్క సుమన్ లపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం*

*బిఆర్ఎస్ ఎస్సీ సెల్ నాయకులు*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జులై 4

చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ పార్టీ అని సవాలు చేస్తూ  కాంగ్రెస్ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపెట్టాలని బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు బిఆర్ఎస్ నేతలైన హరీష్ రావు, బాల్క సుమన్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.  హరీష్ రావు సింగరేణిలో జరిగిన కుంభకోణాన్ని సవివరంగా వివరిస్తూ, కాంగ్రెస్ నేతలపై సవాలు విసిరారని, కాంగ్రెస్ నేతలు సవాలను స్వీకరిస్తూ రాజీనామాల కైనా సిద్ధం కావాలి లేదా కుంభకోణాన్ని అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఏమి తెలియకుండా బిఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులపై అవాకులు చెవాకులు పేలితే సహించమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ బిఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, బాల్క సుమన్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులను అనే స్థాయి కాదని తెలిపారు. ఎవరు రౌడీషీటర్, ఎవరు భూకబ్జాదారులో ప్రజలకు తెలుసునని, నర్సింగ్ కు రాజకీయ బిక్ష పెట్టింది బిఆర్ఎస్ పార్టీ అని, నేడు అటువంటి పార్టీపై విమర్శలు చేయడం తగదని సూచించారు. రాజకీయాలు శాశ్వతం కాదని, స్థాయిని మరిచి మాట్లాడడం సరికాదని తెలిపారు. సింగరేణి గురించి తెలియని వ్యక్తి సింగరేణి పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని, ఇకనైనా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. అన్ని రాజకీయ పార్టీలు మారిన నర్సింగ్ బిఆర్ఎస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. బిఆర్ఎస్ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు కనకం రవీందర్, దాసరి రాజనర్సు, పల్లె నర్సింగ్, దాసరి అనిల్, కోడం శ్రీనివాస్, డబ్ల్యు సురేందర్, బండ రవి, గొర్రె రాజేంద్రప్రసాద్  మొగురం శ్రీనివాస్, జూల శ్రీనివాస్, సట్టు పోశం, రవివర్మ, పెరుగు వెంకటేష్ లు పాల్గొన్నారు.