కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం…. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్
బెజ్జంకి,జూలై 17(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని బేగంపేట్, తోటపెల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వమే నెరవేర్చిందని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పండుగ వాతావరణం నెలకొందని, త్వరలోనే రెండో...