కాంగ్రెస్ పార్టీ హవేలీ ఘనపూర్ మండలాధ్యక్షుడు ప్రజల కోసం కిరణ్ గౌడ్
మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి జూలై 27.
ముత్తాయికోట గ్రామానికి చెందిన ఏలబోయిన శ్యామమ్మ గారు అకాలమరణం చెందడం అత్యంత విచారకరం. ఈ దుర్ఘటన నేపథ్యంలో హవేలి ఘనపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్తాయికోట సర్పంచ్ *గుండారం కిరణ్ గౌడ్* గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పి అండగా నిలిచారు.
ఈ సందర్భంగా అంత్యక్రియల నిమిత్తం రూ.5,000 (ఐదు వేల రూపాయలు) ఆర్థిక సహాయం అందించడం వారి సేవా భావానికి నిదర్శనం. ఇలాంటి కష్టసమయంలో ప్రజలతో నిలబడటం నిజమైన నాయకత్వ లక్షణం.
గౌరవ మైనంపల్లి హన్మంత్ అన్న గారు, ఎమ్మెల్యే రోహిత్ అన్న గారి స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుండి పనిచేస్తున్న కిరణ్ గౌడ్ గారి సేవలు అభినందనీయం. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఇలాంటి నాయకత్వం మరింత బలపడాలని ఆశిద్దాం. 🙏