prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 June 2026, 7:24 am Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్‌కు మరో షాక్.. పరకాలలో గులాబీ వైపు యువత అడుగులు

కాంగ్రెస్‌కు మరో షాక్.. పరకాలలో గులాబీ వైపు యువత అడుగులు..

జూన్ 28 పరకాల( మన ప్రజావాణి)

ఎన్నికల ముందు హామీలతో ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా చేతులెత్తేసిందనే విమర్శలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై విసుగుచెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో పరకాల మండలం వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సిలివేరు భాను, యువ నాయకుడు కన్నం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, హామీలు గాలికొదిలి, పాలనను గందరగోళంగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ అసంతృప్తే ఇప్పుడు పార్టీలోని నాయకులను కూడా బయటకు తీసుకొస్తోంది. ప్రజల ఆశలు నెరవేర్చే శక్తి బీఆర్ఎస్‌కే ఉందనే నమ్మకంతో యువత పెద్దఎత్తున గులాబీ జెండా వైపు వస్తున్నారు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.