కష్టపడి పిల్లల్ని చదివిస్తున్న పేద కుటుంబంపై విధి దెబ్బ
.భార్య ప్రాణాలు కాపాడేందుకు దాతల సహాయం కోరుతున్న భర్త.
.కడుపులో గడ్డలు కదలలేని భార్య.
.చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చిన భర్త.
.స్తోమతకు మించి వైద్య ఖర్చులు.
.ఆదుకోవాలని కుటుంబ సభ్యుల వేడుకోలు.
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
కష్టపడి పని చేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి వారిది. అయినా ఏనాడు వెనుకడుగు వేయలేదు ఆ కుటుంబం. రాత్రానకా,పగలనకా ఆ కుటుంబం కష్టపడి తమ పిల్లల్ని గొప్ప చదువులను చదివిస్తుంది.అలాంటి ఆ కుటుంబాన్ని విధి వక్రీకరించింది. భార్య కడుపులో రక్తం గడ్డలు కట్టి ప్రస్తుతం ఆమె కదలలేని స్థితికి చేరింది. ఓ పక్క పిల్లల చదువులు మరోపక్క భార్య ఆసుపత్రి ఖర్చులు భరించలేక భర్త దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నారాయణగిరిపల్లి గ్రామానికి చెందిన నరిగే రాజకుమార్ -సుజాత దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజకుమార్- సుజాత దంపతులు కష్టపడి పనిచేసే కుటుంబాన్ని పోషిస్తుండేవారు. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా పిల్లలను గొప్ప గొప్ప చదువులు చదివించాలని సంకల్పంతో నారాయణగిరి పల్లి ని వదిలి హన్మకొండలో నివాసం ఉంటున్నారు. భార్య ఒకచోట భర్త మరొకచోట పనిచేస్తూ తమ ఇద్దరి పిల్లల్ని మంచి చదువులు చదివిస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా రాజ్ కుమార్ భార్య సుజాతకు రిప్రొడక్షన్ సిస్టంలోని ఫాలోఫియాన్ నాళాల లోపల రక్తం గడ్డకట్టి కంతులుగా మారాయి. దీంతో సుజాత తీవ్ర కడుపునొప్పి తో బాధపడుతూ ఉండేది. ఇటీవల సుజాత ఎడమ కాలు పూర్తిగా వాపు రావడంతో పాటు ఆమె కదలలేని స్థితికి చేరడంతో భర్త రాజ్ కుమార్ ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఇప్పటికే అటు పిల్లల చదువులకు ఇటు భార్య ఆసుపత్రి ఖర్చులు స్తోమతకు మించి అవ్వడంతో రాజ్ కుమార్ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డాడు. తన భార్య సుజాత ప్రస్తుతం ఖమ్మంలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఇప్పటివరకు సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేయడం జరిగిందని భర్త రాజ్ కుమార్ తెలిపారు. ఇక ముందు ఆమె సర్జరీ నిమిత్తం వైద్య ఖర్చులు రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని, మానవత దృక్పథంతో దాతలు ముందుకొచ్చి
9182634110(పేటియం )
9959786119( గూగుల్ పే )ద్వారా తోసినంత సహాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని సుజాత భర్త రాజ్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.