కవలకుంట్ల టూ పోరుమామిళ్ళ ఆటోల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం. అక్రమ ఆటోలను బంద్ చేసి, ఆర్టీసీ* *బస్సులు నడపాలని గ్రామస్థుల డిమాండ్*!

పోరుమామిళ్ల (ప్రజావాణి జులై 06) మండలంలోని కవలకుంట్ల గ్రామ ప్రజలను ఆటో నిర్వాహకులు ఛార్జీల పేరుతో నిలువుదోపిడీ చేయడమే కాకుండా,ప్రశ్నించిన వారిపై దౌర్జన్యానికి దిగడంపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 11 కిలోమీటర్ల దూరమున్న కవలకుంట్ల నుండి పోరుమామిళ్ళకు గతంలో రూ. 10 ఉన్న ఛార్జీని ఏకంగా రూ. 30 కి పెంచేసి, "దిక్కున్న చోట చెప్పుకోండి" అంటూ ఆటోల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఆటోలను బంద్ చేయించాలని, సామాన్యులకు రవాణా సౌకర్యం కల్పించేందుకు...