కవలకుంట్ల  గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి 

పోరుమామిళ్ళ (ప్రజావాణి జులై 07)  కవలకుంట్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్  ఆవిర్భావ దినోత్సవం, అలాగే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను మంగళవారం గ్రామంలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కమిటీ సభ్యులు ఓబుళాపురం శోభన్ కుమార్ఎంఈయఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సగిలి జాకోబ్ , మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు...