కళ్ళాపి పొడిలో ప్రాణాంతక రసాయనాలు: ప్రొద్దుటూరులో 19 మంది మృతికి కారణమైన ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’, కంపెనీల సీజ్
కడప జిల్లా జూలై 10 ప్రజావాణి ప్రొద్దుటూరులో నిత్యం ఇళ్ల ముందు చల్లే కళ్ళాపి పొడిలో అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతక రసాయనాలు కలపడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సంప్రదాయబద్ధంగా ఇళ్ల ముందు పేడ నీళ్లకు బదులుగా రంగు కోసం వాడుతున్న ఈ కృత్రిమ కళ్ళాపి పొడి కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి దాదాపు 19 మంది మరణించడంతో రంగంలోకి దిగిన అధికారులు షాకింగ్ నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఏడాదిన్నరలో 19 మంది బలి...