కళాకారుడు బబ్బూరి చంద్రమౌళి అకాల మరణం
మర్కుక్, ప్రజావాణి సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలోని చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు బాగోతాల గురువు బబ్బూరి చంద్రమౌళి (56) అకాల మరణం స్థానిక కళారంగానికి తీరని లోటుగా మారింది. గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయనగురువారంమధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మరణవార్తతెలిసిగ్రామస్తులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.బబ్బూరి చంద్రమౌళి చిన్ననాటి నుంచే జానపద, పౌరాణిక కళారూపాలపై ఆసక్తి పెంచుకొని బాగోతాలలో గురువుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఎల్లమ్మ ఆటలో పరశురాముని వేషధారణలో ఆయన చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి....