prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 March 2026, 5:12 pm Digital Edition : VIJAYKUMAR SIDDIPET

కళాకారుడు బబ్బూరి చంద్రమౌళి అకాల మరణం

మర్కుక్, ప్రజావాణి

సిద్ధిపేట జిల్లా మార్కుక్ మండల పరిధిలోని చేబర్తి గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు బాగోతాల గురువు బబ్బూరి చంద్రమౌళి (56) అకాల మరణం స్థానిక కళారంగానికి తీరని లోటుగా మారింది. గత కొంతకాలంగా అనారోగ్యంతోబాధపడుతున్న ఆయనగురువారంమధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మరణవార్తతెలిసిగ్రామస్తులు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.బబ్బూరి చంద్రమౌళి చిన్ననాటి నుంచే జానపద, పౌరాణిక కళారూపాలపై ఆసక్తి పెంచుకొని బాగోతాలలో గురువుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఎల్లమ్మ ఆటలో పరశురాముని వేషధారణలో ఆయన చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. ఆయన వేషధారణ, సంభాషణ తీరు, భావప్రకటనలో ప్రత్యేకత ఉండటంతో గ్రామీణప్రాంతాల్లోమంచిపేరుప్రఖ్యాతలు సంపాదించారు.అలాగే సమ్మక్క–సారక్క బాగోతం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి భాగవతం వంటి పౌరాణిక ప్రదర్శనల్లో గురువుగా వ్యవహరిస్తూ అనేకమంది యువ కళాకారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ కళలను పరిరక్షించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చేబర్తిగ్రామంలోబాగోతాలంటేనే బబ్బూరి చంద్రమౌళి అనే ముద్ర ఏర్పడేలా ఆయన సేవలు అందించారు.చంద్రమౌళి మృతి పట్ల గ్రామ పౌరాణిక కళాకారులు, గ్రామ పెద్దలు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కళాసేవలు చిరస్మరణీయమని, గ్రామీణ జానపద కళారూపాల అభివృద్ధికి ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.