కల్వర్టును పరిశీలించిన కలెక్టర్ ,పూడిక తొలగించాలని ఆదేశాలు.

కోదాడ, మార్చ్ 10: (ప్రజావాణి): ప్రజా పాలన సందర్భంగా కోదాడ 21 వ వార్డు శ్రీమన్నారాయణ కాలనీలో మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ సుడిగాలి పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సుడిగాలి పర్యటన చేయడం పట్ల ప్రజలు ఆశ్చర్య వ్యక్తం చేస్తూ, హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఖాళీ ప్లాట్లల్లో వేసిన చెత్తాచెదారం పట్ల ఏం చర్యలు తీసుకుంటున్నారని మున్సిపల్ కమిషనర్ ను ప్రశ్నించారు. కాళీ ప్లాట్ల వారికి నోటీసులు జారీ చేయాలని, చెత్త...