కల్లేపల్లి గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్న విలెజ్ పోలీస్ ఆఫీసర్
ప్రజలకు భరోసా–భద్రతపై పోలీసుల అవగాహన కల్పించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ బెజ్జంకి, జూలై 3 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోలీస్ పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) కె. శ్రీనివాస్ శుక్రవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమైన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు....