prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 10:31 pm Digital Edition : RAJASHEKARREDDY

కల్లేపల్లి గ్రామంలో పల్లెనిద్రలో పాల్గొన్న విలెజ్ పోలీస్ ఆఫీసర్

 

ప్రజలకు భరోసా–భద్రతపై పోలీసుల అవగాహన కల్పించిన కానిస్టేబుల్ శ్రీనివాస్

బెజ్జంకి, జూలై 3 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పోలీస్ పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లేపల్లి గ్రామంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్ (VPO) కె. శ్రీనివాస్ శుక్రవారం రాత్రి పల్లెనిద్ర నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులతో మమేకమైన ఆయన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా రాత్రంతా గ్రామంలోనే అందుబాటులో ఉండి సహాయం అందిస్తానని భరోసా ఇచ్చి,పోలీస్ పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరగడంతో పాటు గ్రామాల్లో భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆయన తెలిపారు.