కల్లెపల్లిలో మొక్కజొన్న పంట దగ్ధం – రైతులకు అండగా మార్కెట్ కమిటీ చైర్మన్ పులి క్రిష్ణ
బెజ్జంకి, మే 3(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామంలో చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం జరిగింది. ఈ ఘటనతో ఆవేదన చెందిన రైతులను బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన బాధిత రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పి, ప్రభుత్వం ద్వారా తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.రైతులు ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవి,...