prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:54 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కలెక్టరేట్ కి వేలాదిమంది కదం తొక్కిన అంగన్వాడీలు వేతనాలు పెంచే వరకు పోరాటం ఆగదు ధర్నాలో వక్తలు డిమాండ్

చిత్తూరు జిల్లా జూలై 10 ప్రజావాణి ఆల్ ఇండియా కమిటీ పిలుపుమేరకు కోర్కెలు దినోత్సవం సందర్భంగా బ్లాక్ డే శుక్రవారం కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో వేలాది మంది అంగన్వాడీలు కదం తొక్కారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా భారీ ధర్నానుద్దేశించి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు,అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శి షకీల, సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ,గిరిధర్ గుప్తాలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా వేతనం పెంచకుండా అంగన్వాడీల దగ్గర వెట్టిచాకిరి చేయించుకుంటున్నదని విమర్శించారు. ఐసిడిఎస్ ఏర్పాటు అయ్యి 50 సంవత్సరాల అయిన సందర్భంగా అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనాలు అమలు చేయాలని, నవచేతన యాప్ రద్దు చేయాలని ,అంగనవాడిలపై వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల ప్రభుత్వ పనులు అంగన్వాడి దగ్గర చేయించుకుంటూ వేతనాలు పెంచకపోవడం ఏమిటని ప్రశ్నించారు. రోజురోజుకు అన్ని రకాల వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న అంగన్వాడీల వేతనాలు పెంచకపోవడం దారుణం అన్నారు.రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మినిట్స్ ఇచ్చి సమస్యలు పరిష్కారం చేస్తామని వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ పోరాటం సందర్భంగా పిలవకపోయినా ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా అంగనవాడి శిబిరాల దగ్గరకు వచ్చి అంగన్వాడీలకు మద్దతుగా మాట్లాడారు. కుప్పంలో బహిరంగ సభలో స్వయంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మేం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రకటన చేశారు. దీనిని అంగనవాడి లు స్వాగతించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓట్లు వేయించడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలైనా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఏరు దాటే వరకే మల్లన్న- ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్న చందంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అంగన్వాడీలు చేసిన పోరాటం అనచడానికి చంద్రబాబు నాయుడు రకరకాలుగా ప్రయత్నం చేశారని చంద్రబాబు నాయుడుని ఇంటికి పంపించిన చరిత్ర అంగన్వాడీలకు ఉందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ తెచ్చుకోవద్దని హెచ్చరించారు. అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచి పని భారం అవుతున్న నవచేతన యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తా కలెక్టర్ హామీ ధర్నా అనంతరం అంగన్వాడి నాయకత్వం కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రీ స్కూల్స్ బలోపేతం చేయడానికి అంగన్వాడీలను స్కూళ్ల దగ్గర ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు భారం తగ్గించాలని కలెక్టర్ ని కోరగా జిల్లాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పిడి ని కలిసి జిల్లాలో ప్రాజెక్టులో ఉన్న సమస్యలు పరిష్కారం కోసం జిల్లా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని కోరగా ఏర్పాటు చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు సుజిని ,మమత, లక్ష్మీ రాధిక, పద్మ, పద్మమ్మ, అనిత, శ్యామలమ్మ, మమత, ధనకోటి, వరలక్ష్మి, భాను, శోభారాణి, జమున, నాగరత్న ,భారతి, వరలక్ష్మి లతోపాటు వేలాది మంది అంగన్వాడీలు పాల్గొన్నారు