కలాం ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళి: వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, జూలై 27 (ప్రజావాణి): భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపూర్ గ్రామంలో సోమవారం ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, స్థానిక నాయకులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం...