కలసపాడు హాస్పటల్‌కు డాక్టర్లు గైర్హాజరు… ఎవరి కోసం ఈ ఆసుపత్రి?

ప్రజావాణిన్యూస్(మార్చి22)కడప జిల్లా కలసపాడు మండల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు,నర్సుల నిర్లక్ష్యం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి,ప్రస్తుతం బాధితుల వేదనకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆదివారం పేరుతో,లేదా విధుల పట్ల అలసత్వంతో,డాక్టర్లు సమయానికి హాజరుకాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.మధ్యాహ్నం అయ్యే సరికి కూడా ఆసుపత్రిలో వైద్యులు కనిపించకపోవడంతో,చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ వైద్యులు,తమ బాధ్యతలను విస్మరించి వ్యక్తిగత పనుల్లో నిమగ్నమవుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు.పేద ప్రజలకు...