కలసపాడు మండలంలో రూ. 5.5 కోట్ల రోడ్డు నిర్మాణంలో ఘోర అవినీతి! నాసిరకం తారు రోడ్డు నిర్మాణం అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం 

 లేని ‘ సుగాలి తండా’కు రోడ్డు సృష్టించి బిల్లుల స్వాహా?  గత ప్రభుత్వ ఎమ్మెల్సీ బంధువుల కోసమే నిధుల మంజూరు?  మట్టి పని లేదు.. మెటలింగ్ లేదు.. రైతుల ఆగ్రహం కలసపాడు (జూన్ 03) ప్రజావాణి మండలం ఈ.రామాపురం గ్రామంలో తారు రోడ్డు నిర్మాణం పేరిట కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పట్టిందని స్థానిక రైతులు,గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ.రామాపురం నుండి తంబళ్లపల్లి వయా సుగాలి తండా వరకు రూ. 5 కోట్ల 50 లక్షల భారీ అంచనా వ్యయంతో చేపట్టిన...