ప్రజావాణి: కలసపాడు మండలంలోని కలసపాడు పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం ఎస్సై సుభాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు ఆహ్వానించి పోలీస్ స్టేషన్ విధులు,ఎఫ్ఐఆర్లు,పలు రికార్డులు, ఖైదీలను ఉంచే లాకపు గదులను విద్యార్థులకు చూపించారు. మరియు సైబర్ క్రైమ్, మహిళలు, బాలికల, భద్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్, నాగార్జున ,అజారుద్దీన్, పీరయ్య,విద్యా ర్థులు, తదితరులు పాల్గొన్నారు