కలసపాడు కేజీబీవీలో ఘోరం: కుప్పకూలిన ప్రహరీ గోడ.. విద్యార్థినుల ప్రాణాలతో అధికారుల చెలగాటం!
* కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి.. అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం! * కూతుళ్లను చదివించాలా? లేక బలివ్వాలా? అని మండిపడుతున్న తల్లిదండ్రులు! వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూన్18) కలసపాడు అట్టడుగు వర్గాల,పేద కుటుంబాల ఆడపిల్లలకు నాణ్యమైన వసతి,విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల (కేజీబీవీ) ఇప్పుడు విద్యార్థినుల పాలిట మృత్యుకూపంగా మారుతోంది.కలసపాడు మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూలు ఆవరణలో నిర్మించిన ప్రహరీ గోడ నాసిరకం పనుల కారణంగా ఒక్కసారిగా...