* కాంట్రాక్టర్ల కాసుల కక్కుర్తి.. అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!
* కూతుళ్లను చదివించాలా? లేక బలివ్వాలా? అని మండిపడుతున్న తల్లిదండ్రులు!
వైఎస్సార్ కడప జిల్లా (ప్రజావాణి జూన్18) కలసపాడు అట్టడుగు వర్గాల,పేద కుటుంబాల ఆడపిల్లలకు నాణ్యమైన వసతి,విద్యను అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల (కేజీబీవీ) ఇప్పుడు విద్యార్థినుల పాలిట మృత్యుకూపంగా మారుతోంది.కలసపాడు మండల కేంద్రంలోని కేజీబీవీ స్కూలు ఆవరణలో నిర్మించిన ప్రహరీ గోడ నాసిరకం పనుల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.అదృష్టవశాత్తూ ఆ సమయంలో ణాలను పూర్తిగా తుంగలో తొక్కారనేందుకు ఇక్కడి శిథిలాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.గోడ పునాదుల నుండి పైభాగం వరకు ఎక్కడా సరైన సిమెంట్,ఇసుక మిశ్రమాన్ని వాడినట్లు కనిపించడం లేదు.కట్టిన కొద్ది కాలానికే గోడలు నెర్రెలు చీలిపోయి, ముక్కలు ముక్కలుగా విడిపోయి నేలమట్టమయ్యాయి. కాంట్రాక్టర్ కాసుల కక్కుర్తికి,నిర్మాణ పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారుల అలసత్వానికి ఈ ఘోర తప్పిదం అద్దం పడుతోంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తూ విద్యార్థుల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలాంటి నాసిరకం నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారని స్థానికులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు.నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న యంత్రాంగం!
గోడ కూలి రోజులు గడుస్తున్నా,ప్రమాదం కళ్లముందే కనిపిస్తున్నా విద్యాశాఖ అధికారులు కానీ,మండల స్థాయి ఉన్నతాధికారులు కానీ ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.ప్రహరీ గోడ కూలిపోవడంతో హాస్టల్‌లో ఉంటూ చదువుకునే బాలికలకు రక్షణ కరువైంది. చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులు లోపలికి వచ్చే ప్రమాదం ఉందని,అలాగే విషసర్పాలు,వీధి కుక్కలు తిరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యులెవరు? తల్లిదండ్రుల ఆవేదన, ఆగ్రహం!
“ఆడపిల్లలకు రక్షణ ఉంటుందని నమ్మి ఇక్కడ చేరిస్తే,కనీసం ప్రహరీ గోడ కూడా సరిగ్గా కట్టలేకపోయారు. రేపు మా పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారుల నిర్లక్ష్యానికి మా పిల్లల ప్రాణాలు బలి కావాలా?”అంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన,ఘాటుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారుల తీరుపై నమ్మకం సన్నగిల్లిందని,వెంటనే స్పందించకపోతే విద్యార్థినులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి,కలసపాడు కేజీబీవీ స్కూలును సందర్శించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.నాసిరకం పనులకు పాల్పడిన కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, కమీషన్ల కక్కుర్తితో పనులను చూసీచూడనట్లు వదిలేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.అంతేకాకుండా,విద్యార్థినుల భద్రతను దృష్ట్యా తక్షణమే అక్కడ కొత్త ప్రహరీ గోడను యుద్ధప్రాతిపదికన నిర్మించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు