కరెంట్ షాక్ కారణంగా వ్యక్తి మృతి

*కరెంట్ షాక్ కారణంగా వ్యక్తి మృతి.* రేగొండ మే 28 (ప్రజావాణి):-జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపి రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కనుకుంట్ల గోపి (46), వృత్తి వ్యవసాయం, ఈ రోజు ఉదయం ఇంటి ముందు మోటార్ ఆన్ చేసి డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకుంటుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఇటీవల గోపి తండ్రి సమ్మయ్య వృద్ధాప్యంతో మృతి చెందగా, మూడవ రోజు కార్యక్రమ ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమై...