prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 7:37 am Digital Edition : PRAJA VANI

కరెంట్ షాక్ కారణంగా వ్యక్తి మృతి

*కరెంట్ షాక్ కారణంగా వ్యక్తి మృతి.*
రేగొండ మే 28 (ప్రజావాణి):-
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపి రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన కనుకుంట్ల గోపి (46), వృత్తి వ్యవసాయం, ఈ రోజు ఉదయం ఇంటి ముందు మోటార్ ఆన్ చేసి డ్రమ్ముల్లో నీళ్లు పట్టుకుంటుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఇటీవల గోపి తండ్రి సమ్మయ్య వృద్ధాప్యంతో మృతి చెందగా, మూడవ రోజు కార్యక్రమ ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు నిమగ్నమై ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం సుమారు 5 గంటల సమయంలో గోపి ఇంటి ముందు ఉన్న మోటార్ ఆన్ చేసి నీళ్లు పట్టుకుంటుండగా, అక్కడ ఉన్న రేకులకు చేయి తగిలింది. అప్పటికే విద్యుత్ తీగ పేలి ఉండటాన్ని గమనించకుండా రేకులను పట్టుకోవడంతో కరెంట్ షాక్ తగిలింది.ఆయనను రక్షించేందుకు వెళ్లిన కుటుంబ సభ్యురాలికీ స్వల్పంగా కరెంట్ షాక్ తగిలినట్లు తెలిసింది. అనంతరం కుటుంబ సభ్యులు వెంటనే గోపిని ప్రభుత్వ ఆసుపత్రి, పరకాలకు తరలించగా, డ్యూటీ డాక్టర్ పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఫిర్యాదురాలు మృతుని భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేగొండ ఎస్సై డి సుధాకర్  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు.