prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 8:39 am Digital Edition : RAJASHEKARREDDY

కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి

కరెంట్ షాక్‌తో అసిస్టెంట్ లైన్మెన్ మృతి

బెజ్జంకి -కోహెడ,ఏప్రిల్ 18(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్ గ్రామంలో అసిస్టెంట్ లైన్మెన్ భూక్య సురేష్ (40) కరెంట్ షాక్‌కు గురై మృతి చెందాడు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, వ్యవసాయ బావుల వద్ద వేలాడుతున్న విద్యుత్ వైర్లను పైకి ఎత్తాలని రైతులు కోరగా, వరి కోత పూర్తయ్యాక పని చేస్తామని లైన్మెన్ తెలిపాడు. అనంతరం రెండు రోజుల తర్వాత హార్వెస్టర్‌తో కోత పూర్తైన తర్వాత ఆదివారం ఆయన ఎల్సీ (లైన్ క్లియరెన్స్) తీసుకొని పనులు ప్రారంభించారు.ఈ సమయంలో రెండు ఫీడర్ల నుంచి ఒకేసారి విద్యుత్ సరఫరా కొనసాగడంతో ప్రమాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లుఅనుమానిస్తున్నారు. నాలుగు గ్రామాలకు ఒకే అసిస్టెంట్ లైన్మెన్ ఉండటంతో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదానికి కారణమై ఉండొచ్చని సహచరులు పేర్కొంటున్నారు.మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.