భార్య మృతిని తట్టుకోలేక ఎస్‌ఐ చంద్రశేఖర్ ఉరి వేసుకొని ఆత్మహత్య
మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి / కరీంనగర్: గత ఐదు రోజుల క్రితం, కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ ఎస్‌ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు చేసుకోగా కడుపు నొప్పి తో ఆత్మహత్య చేసుకుందనీ ;పోలీసులకు భర్త ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దివ్య మృతదేహాన్ని స్వగ్రామం ఇల్లందకుంట మండలం సీతంపేట కు తరలించగా సీతంపేట గ్రామంలో దివ్య ఆత్మహత్యకు భర్త చంద్రశేఖర్ కారణమని మృతురాలి బంధువులు దాడికి ప్రయత్నించారు.దీంతో గ్రామస్తులు, బంధువుల నిరసనల మధ్య మృతురాలి తల్లిదండ్రులు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా శనివారం ఐదు రోజుల కార్యక్రమానికి అత్తగారింటికి వచ్చిన ఎస్సై చంద్రశేఖర్ అత్తగారింట్లోనే ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడ్డాడు. గదిలో నుండి బయటికి రాకపోవడం తో అనుమానం తో చూడగా ఉరి వేసుకొని ఉండడం తో జమ్మికుంట లోనీ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు