కరీంనగర్ బంద్‌కు మద్దతు తెలిపిన నేతలను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
బెజ్జంకి,మే 9 (ప్రజావాణి ) కరీంనగర్ బంద్‌కు మద్దతు తెలిపిన తమను ఇంట్లోనే నిర్బంధించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడం తప్ప మరొకటి కాదని మాజీ శాసనసభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ విమర్శించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయంపై జరిగిన దాడి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కారుపై జరిగిన దాడిని ఖండిస్తూ నిర్వహించిన కరీంనగర్ బంద్‌లో పాల్గొనకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ప్రజల కోసం పోరాడే నాయకులను పొద్దుపొద్దున్నే నిద్రలేపి ఇంటికే పోలీసులను పంపించడం ఇందిరమ్మ రాజ్యంలో వచ్చిన మార్పా అని...