బెజ్జంకి, జూలై 13
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కరీంనగర్ పాలడైరీలో పాలు పోసే పాడి రైతుల కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కరీంనగర్ పాలడైరీ ఆధ్వర్యంలో స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ల గ్రామ కరీంనగర్ పాలడైరీ అధ్యక్షులు కేడిక మాధుసూదన్ రెడ్డి, మేనేజర్ సుధాకర్, సైట్ సూపర్‌వైజర్ ధన్‌రాజ్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాడి రైతుల కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. రైతు కుటుంబాలకు విద్యా పరంగా తోడ్పాటు అందించడం కరీంనగర్ పాలడైరీ సామాజిక బాధ్యతలో భాగమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.